»Congress First List In Ap Election Ys Sharmila From Kadapa
YS Sharmila: ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తొలి జాబితా.. కడప నుంచి వైఎస్ షర్మిల
ఏపీ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధం అయింది. తొలి జాబితా ప్రకటించింది. 114 అసెంబ్లీ స్థానాలు, 5 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీచేస్తున్నారు.
Congress first list in AP election.. YS Sharmila from Kadapa
YS Sharmila: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ సిద్దం అయింది. కాంగ్రెస్ అభ్యర్థుల (Congress Candidates) తొలి జాబితాను ఇవాళ ప్రకటించారు. ఏపీసీసీ వైఎస్ షర్మిల (YS Sharmila) తాజా అభ్యర్థుల లిస్ట్ ప్రకటించారు. ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి సమాది వద్ద నివాళి అర్పించిన అనంతరం రాష్ట్రంలో ఐదుగురు ఎంపీ, 114 అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను తెలిపారు. కడప(Kadapa) లోక్సభ స్థానం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే కుప్పం అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆవుల గోవిందరాజులు, నందికొట్కూరు నుంచి ఆర్డర్, చింతలపూడి నుంచి ఎలిజా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఐదు ఎంపీ స్థానాల అభ్యర్థుల లిస్ట్
కడప – వైఎస్ షర్మిల
కర్నూలు – రాంపుల్లయ్య యాదవ్
రాజమండ్రి – గిడుగు రుద్రరాజు
బాపట్ల – జేడీ శీలం
కాకినాడ – పల్లంరాజు.