»Cm Jagan Will Launch Infosys In Visakhapatnam On 16th
Infosys in AP: విశాఖకు ఇన్ఫోసిస్..16న ప్రారంభించనున్న సీఎం జగన్
ఏపీలోని విశాఖలో ఐటీ సెక్టార్ డెవలప్ కానుంది. ఈ మేరకు అక్టోబర్ 16వ తేదిన ఇన్ఫోసిస్ కేంద్రాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ కంపెనీ ద్వారా చాలా మందికి ఉపాధి లభించనుంది. త్వరలోనే మరిన్ని కంపెనీలో విశాఖలో వెలియనున్నట్లు ఏపీ ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు.
ఏపీ (Andhrapradesh)లో పరిశ్రమలు లేవని చాలా మంది కామెంట్స్ చేశారు. ఏపీ నుంచి వలసలు వెళ్తున్నారని, వైసీపీ(YCP)ని చూసి ఏ కంపెనీ ముందుకు రావడం లేదని ఇతర పార్టీ నేతలు, ఇరుగుపొరుగు రాష్ట్రాల్లోని కొందరు నాయకులు గతంలో మాట్లాడారు. అయితే ఇప్పుడు అక్కడి పరిస్థితులు మారాయి. ఏపీలోని విశాఖ నుంచే పాలన సాగనుంది. ఈ దసరాకు సీఎం ఆఫీస్ (CM Office) ప్రారంభం కానుంది. తాజాగా విశాఖలో ఇన్ఫోసిస్ ఐటీ డెవలప్మెంట్ సెంటర్ (Infosys IT Developement Centre) ప్రారంభవ్వనున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnadh) వెల్లడించారు.
విశాఖ(Visakhapatnam)లో నెలకొల్పిన ఇన్ఫోసిస్ ఐటీ డెవలప్మెంట్ సెంటర్ను ఏపీ సీఎం జగన్ (Cm Jagan) అక్టోబర్ 16వ తేదిన ప్రారంభించనున్నట్లు తెలిపారు. విశాఖలోని మధురవాడ సిగ్నిటివ్ టవర్స్ వద్ద ఇన్ఫోసిస్ డేటా సెంటర్ (Infosys Data Centre) నిర్మాణాన్ని చేపట్టారు. ఆ నిర్మాణం ఇప్పుడు పూర్తయ్యింది. ప్రారంభోత్సవం విషయమై సీఎం జగన్తో మంత్రి గుడివాడ అమర్నాథ్ చర్చింనట్లు తెలిపారు.
ఈ ఇన్ఫోసిస్ కేంద్రం (Infosys Centre)లో మొదట 650 మంది కార్యకలాపాలు సాగుతాయన్నారు. ఆ తర్వాత త్వరలోనే 1000 మందితో సేవలు కొనసాగుతాయన్నారు. విశాఖ నుంచి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ (Software Developement), ఐటీ అనుబంధ సేవలు (IT Services), ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ వంటివే కాకుండా ఇతర సేవలు కూడా అందించనున్నట్లు ఇన్ఫోసిస్ (Infosys) వెల్లడించింది. త్వరలోనే విశాఖలో ఏపీ సినీ పరిశ్రమ కూడా ఏర్పాటు కానున్నట్లు సమాచారం. అలాగే మెట్రో సేవలు కూడా త్వరలోనే విశాఖలో అందుబాటులోకి రానున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది.