chandrababu:వైసీపీ శ్రేణులకు పూర్తి స్వేచ్చనిచ్చారా.? డీజీపీకి చంద్రబాబు లేఖ
గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu) స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఆయన డీజీపీకి (dgp) లేఖ (letter) రాశారు. అధికార వైసీపీ శ్రేణుల తీరును తప్పుపట్టారు. వైసీపీ గూండాలకు పోలీసులు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు కనబడుతుందని ఆగ్రహాం వ్యక్తం చేశారు.
chandrababu:గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu) స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఆయన డీజీపీకి (dgp) లేఖ (letter) రాశారు. అధికార వైసీపీ శ్రేణుల తీరును తప్పుపట్టారు. వైసీపీ గూండాలకు పోలీసులు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు కనబడుతుందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. వైసీపీ శ్రేణులు దాడులకు దిగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పట్టాభిని (pattabi) పోలీసులు (police) అరెస్టు చేశారా..? లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ నేతలు దొంతు చిన్నా, పట్టాభి భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. నిందితులను అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
గన్నవరంలో పోలీసులు 144 సెక్షన్ (144 section) విధించారు. పోలీస్ యాక్ట్ 30 (police act 30) అమలు చేస్తున్నారు. టీడీపీ, వైసీపీ ఆఫీసుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. వల్లభనేని వంశీ అనుచరులే టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని టీడీపీ శ్రేణులు ఆరోపించిన విషయం తెలిసిందే. విచారణలో నిజ నిజాలు తేలనున్నాయి.
గన్నవరంలో టీడీపీ ఆఫీసుపై దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. వంశీ (vamsi) వర్గీయులే ఈ పని చేశారని ఆరోపణలు వచ్చాయి. చంద్రబాబు, లోకేశ్‌పై (lokesh) వంశీ విమర్శలు చేశారు. టీడీపీ నేతలు వంశీ లక్ష్యంగా కామెంట్ చేయగా.. వంశీ అనుచరులు గన్నవరం (gannavaram) టీడీపీ ఆఫీసు వద్ద బీభత్సం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసులను మొహరించారు. గన్నవరం వెళ్లిన టీడీపీ నేత పట్టాభి ఆచూకీ తెలియడం లేదు. ఆమె భార్య పోలీసులకు అల్టిమేటం జారీ చేశారు. లేదంటే డీజీపీ ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు.
గత ఎన్నికలో వల్లభనేని వంశీ (vamsi) టీడీపీ నుంచి గెలిచారు. వైసీపీలో చేరేందుకు ప్రయత్నించారు. అయితే పదవీకి రాజీనామా చేసి.. రావాలని సీఎం జగన్ (jagan) కండీషన్ పెట్టారు. దీంతో ఆయన వైసీపీలో చేరిక ఆలస్యం అవుతూ వచ్చింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీలో చేరిక తథ్యం అని అనుకుంటున్నారు. అందుకే చంద్రబాబు (chandrababu), లోకేశ్ (lokesh) లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని, వంశీ, వంగవీటి రాధా మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే.