»Chandrababu Said That It Was Tdp That Completely Suppressed The Faction
Kadapa : ఫ్యాక్షన్ను పూర్తిగా అణచివేసింది టీడీపీయే : చంద్రబాబు
కడప(Kadapa)లో టీడీపీ జోన్ ఐదు జిల్లాల సమీక్ష సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) వైసీపీ ప్రభుత్వంపై వివర్శలు నేతలపై సెటైర్లు వేశారు.అరాచకాలకు, వేధింపులకు పాల్పడిన వైసీపీ (YCP) నాయకులకు మేము అధికారంలోకి రాగానే చక్రవడ్డీతో కలిపి ఇచ్చేస్తాం అంటూ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చాకా మొదటి అరు నెలలు ఇదే మనకు పనిగా ఉంటుందని..ఇప్పుడే గ్రామాల వారిగా లిస్ట్ తయారు చేసుకొండి అంటూ టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు
రాయలసీమ(Rayalaseema)లో ఫ్యాక్షన్ను పూర్తిగా అంతం చేసింది టీడీపినేని అధినేత చంద్రబాబు (Chandrababu) తెలిపారు. కడప జిల్లా పర్యటనలో ఏర్పటు చేసిన సభలో బాబు మాట్లాడారు. వైసీపీ (YCP) ప్రభుత్వం పవర్లోకి వచ్చిన తర్వాత మళ్లీ హత్యలు, దౌర్జన్యాలు, బలహీనవర్గాలపై దాడులు పెరిగాయని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో హత్యా రాజకీయాలు పోవాలి. వివేకా హత్య కేసును ప్రజాకోర్టులో పెడతాం. వైఎస్ వివేకా (YS Viveka) హత్య కేసు.. ప్రపంచంలోని పోలీసు అధికారులకు కేస్ స్టడీ. వివేకా హత్య కేసు నిందితులు సీబీఐ అధికారులనూ బెదిరించారు. గొడ్డలితో నరికి గుండెపోటుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. అడ్డు వచ్చిన వారందర్నీ చంపేస్తారా?అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీల తోకలు కట్ చేస్తాం’’ అని చంద్రబాబు అన్నారు.
అధికారాన్ని అడ్డంపెట్టుకుని వైసీపీ (YCP) నేతలు ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని చంచల్ గూడా (Chanchal Guda) జైలుకు వెళ్లోచ్చిన సీఎం జగన్ (CM Jagan) ఎదో చేస్తానని మాయమాటలు నమ్మిప్రజలు ఓట్లేశారని ఇప్పుడు అటువంటి జగన్ పాలనలో ప్రజలు నానా పాట్లు పడుతున్నారన్నారు. పికే (రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్) మాటలు విని కొడి కత్తితో పోడిపించుకుని..చంద్రబాబు పొడిపించారని డ్రామా అడాడని జగన్ పై విరుచుకుపడ్డారు అచ్చెన్నాయుడు (Achchennaidu). సొంత బాబాయిని చంపి సిఎంగా గెలిచాడంటూ జగన్ పై సెటైర్లు వేశారు.వివేకాను చంద్రబాబు చంపించాడని నారాసుర రక్త చరిత్ర అని కరపత్రాలు వేయించాడని కానీ అదే కేసులో ఇప్పుడు నిజాలన్నీ బయటకొస్తున్నాయని మరికొన్ని రోజుల్లో ఇక ఈ కేసులో కొంతమంది జైలుకు వెళ్లటం ఖాయమన్నారు