కొడాలి నానికి.. పార్టీతో సంబంధం లేకుండా క్రేజ్ ఉందని చెప్పొచ్చు. ఆయనకు ఎంత పాజిటివిటీ ఉందో… అంతే నెగిటివిటీ కూడా ఉంది. తెలుగుదేశం పార్టీలో తిరుగులేని నాయకుడిగా నిరూపించుకున్న ఆయన… ఆ తర్వాత వైసీపీ తీర్థం చేసుకున్నారు. వైసీపీలోనూ ఆయన తిరుగులేని నేతగా నిలుస్తున్నారు. చంద్రబాబుపై ఎలాంటి విమర్శలు చేయడానికైనా కొడాలి నాని వెనకాడరు. దీంతో…. అతను ప్రత్యర్థి పార్టీలో ఉండటం చంద్రబాబుకి చాలా కష్టంగా ఉంది. గతంలో టీడీపీలో ఉండటంతో…. వారి లూపులన్నీ తెలియడంతో.. మరింత రెచ్చిపోతూ కామెంట్స్ చేస్తూ ఉంటాడు. అందుకే… తనకు కొరకరాని కొయ్యలా ఉన్న కొడాలిని వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు చంద్రబాబు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.
గుడివాడ నియోజకవర్గానికి వరుసగా నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహిస్తున్న నానిని ఓడించేందుకు టీడీపీకి సరైన అభ్యర్థి దొరకడం లేదు. ప్రస్తుతం గుడివాడ ఇంచార్జి రావి వెంకటేశ్వరరావు అయితే టీడీపీ తరపున పోరాడుతున్నారు కానీ ఆయన నానికి ధీటైన అభ్యర్థి అని చెప్పలేం. అందుకే గుడివాడకు చెందిన ఓ ఎన్నారై రూపంలో చంద్రబాబు నాయుడుకు సమర్థుడైన అభ్యర్థి దొరికినట్లు సమాచారం.
సదరు ఎన్ఆర్ఐ పేరు వెనిగండ్ల రాము అని ఆయన ఇప్పుడు అమెరికాలో మెడికల్ కన్సల్టెన్సీ వ్యాపారం చేస్తున్నాడు అని తెలుస్తోంది. అయితే అతను కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే అయినా అతని భార్య ఎస్సీ. ఆమె తండ్రి గుడివాడలో ఒక ప్రముఖ పాస్టర్. గుడివాడ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లోని చర్చిలలో ఆయనకు మంచి పేరు, పలుకుబడి ఉన్నాయి.
అంటే నానికి గట్టి మద్దతుగా ఉన్న కమ్మ, ఎస్సీ, క్రిస్టియన్ మైనార్టీ ఓట్లకు ఇలా చెక్ పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. రాము ఆర్థికంగా కూడా మంచి బలవంతుడు కావడంతో ఆయన పట్ల చంద్రబాబు ఆసక్తిగా ఉన్నారని అంటున్నారు. ఇప్పటికే చర్చలు జరిగాయని ఆ చర్చల ఫలితంగా వచ్చే నెలలో రాము గుడివాడకు వచ్చి అన్న క్యాంటీన్‌తో పాటు పలు కార్యక్రమాలను ప్రారంభించనున్నారని అంటున్నారు. వచ్చే ఏడాదిన్నర కాలంలో ఆయన అందుబాటులోకి వస్తారని టీడీపీకి ఉన్న బలంతో ఆయన కూడా విజయబావుటా ఎగురవేస్తారని అంటున్నారు.