SKLM: జిల్లా కలెక్టరేట్లో ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమావేశం అధికారులు నిర్వహించారు. సోమవారం ఈ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్, పౌర సరఫరాల కమీషనర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. 2025–26 ఖరీఫ్ సీజన్లో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ప్రణాళికను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు.