NLR: కావలి పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో పూరి ఎక్సప్రెస్ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటు చేసుకున్నది. ఈ మేరకు రైల్వే ఎస్సై వెంకట్రావు తెలియజేశారు.ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి వద్ద చెన్నై నుంచి ఒంగోలు వెళ్లే టికెట్టు ఉంది. ఆయన వయస్సు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని తెలియజేశారు. వివరాలు తెలిసినవారు తమను సంప్రదించాలన్నారు.