TPT: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి దర్శించుకున్నారు. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని ఇవాళ ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.