SKLM: ఎరువుల కొరతపై రైతన్నకు బాసటగా వైసీపీ పిలుపునిచ్చిన అన్నదాత పోరు కార్యక్రమం సోమవారం నిర్వహించనుండగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ర్యాలీ, నిరసనలకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. ప్రభుత్వం ఆంక్షలు విధించి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులను బయటకు రాకుండా చేయడం అన్యాయమని సీదిరి మండిపడ్డారు.