అన్నమయ్య: మదనపల్లిలో మహిళా భద్రతపై అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారీ ‘2కే వాకథాన్’ నిర్వహించనున్నట్లు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. ఆదివారం ఉదయం 7 గంటలకు బీటీ కళాశాల మైదానం నుంచి చైతన్య యాత్ర ప్రారంభమవుతుంది. మహిళలు ఇంట్లో ఎంత సురక్షితంగా ఉంటారో, బయట కూడా అంతే ధైర్యంగా తిరిగేలా భరోసా కల్పించడమే ఈ నడక లక్ష్యమన్నారు.