NLR: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందుకున్న సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేందుకు స్థానిక 41వ డివిజన్ మనుమ సిద్ధి నగర్ ప్రాంతంలో శుక్రవారం పర్యటించారు. డివిజన్ పరిధిలో జరిగిన వివిధ రకాల సివిల్ వర్క్స్, డ్రైన్ కాలువలు, సిసీసీ రోడ్ల నిర్మాణం పనులను కమిషనర్ తనిఖీ చేశారు.