NLR: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తన పదవి నుంచి వైదొలగాలని ఉదయగిరి వైసీపీ సమన్వయకర్త మేకపాడు రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వింజమూరులోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనైతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ టీటీడీ ఛైర్మన్ పదవికి కళంకం తెచ్చిన బీఆర్ నాయుడు తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.