SKLM: శాసనసభలో ఆమదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే కూన రవికుమార్ పలు అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంజీఎన్ఆర్ఇజీఎస్ నిధుల ద్వారా నిర్మించిన అంగన్వాడీ భవనాలలో అవకతవకలు జరిగాయని తెలిపారు. దీనిపై సంబంధిత మంత్రిని ప్రశ్నించి, ఈ అవకతవకలపై వెంటనే విచారణ చేపట్టాలని కోరారు.