ATP: గుంటూరులో వృద్ధురాలిపై జరిగిన హత్యాచార ఘటనను నిరసిస్తూ మంగళవారం అనంతపురం జిల్లా గుత్తిలో బీఎస్పీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గద్దల నాగభూషణం, విజయ్ మాట్లాడుతూ.. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.