ప్రకాశం: అద్దంకిలోని భవిత కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖాధికారి భూదాటి సుధాకరరావు పాల్గొని, ఆటపాటలలో సాంస్కృతిక కార్యక్రమంలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా సుధాకరరావు మాట్లాడుతూ.. ప్రత్యేక అవసరాలుగల విద్యార్థులు అన్ని రంగాలలో బాగా రాణిస్తున్నారని అన్నారు.