GNTR: కూటమి ప్రభుత్వం ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ చేయకపోవడం వల్లే రైతులు తీవ్రంగా నష్టపోయారని పొన్నూరు వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అన్నారు. పెదకాకాని మండలంలో తుఫానుకు దెబ్బతిన్న పంట పొలాలను శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. వైసీపీ పాలనలో రైతు సంక్షేమం దృష్ట్యా ఉచిత పంటల బీమా కోసం రూ.7 వేల కోట్లు ప్రభుత్వం కేటాయించిందని గుర్తు చేశారు.