KRNL: పెద్దకడబూరు మం. దొడ్డిమేకల గ్రామానికి చెందిన తెలుగు లక్ష్మి వ్యక్తిగత సమస్యలతో పెద్దకాలువ మెయిన్ బ్రిడ్జి వద్ద నీళ్లలో దూకింది. గమనించిన చిన్నకడబూరుకు చెందిన రామ్ రెడ్డి, భీమిరెడ్డి వెంటనే నీళ్లలోకి దూకి ఆమెను రక్షించారు. విషయాన్ని పెద్దకడబూరు పోలీసులకు తెలియజేయగా, వారు ఘటనా స్థలానికి వచ్చి లక్ష్మి కుటుంబసభ్యులతో కౌన్సెలింగ్ నిర్వహించారు.