NTR: విజయవాడలో ‘సూర్య ఘర్–ముఫ్త్ బిజ్లీ’ యోజనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన సూర్యాంధ్ర ప్రగతి రథాలను కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా గృహాలలో సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించి, ప్రజలను విద్యుత్ స్వావలంబన వైపు తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని కోరారు.