W.G: భీమవరం పట్టణంలో కొలువైన శ్రీమావుళ్ళమ్మ అమ్మవారికి పట్టణానికి చెందిన కలిదిండి వెంకట దిలీప్ కుమార్ వర్మ 10 గ్రాములు బంగారం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మద్దిరాల రమణ శర్మ పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ప్రసాదాలు, అమ్మవారి ఫొటోను వారికి అందించారు.