తిరుపతి: ఎస్వీయూలోని ఎంప్లాయిమెంట్ ఆఫీస్లో ఈ నెల 10వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టి. శ్రీనివాసులు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్ఎస్సీ, ఇంటర్, ఐటీ ఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఫార్మసీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు పలు కంపెనీలు ఇంటర్వ్యూలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి గలవారు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.