NLR: కండలేరు జలాశయం పరిధిలో చేపల మాఫియా అక్రమంగా చేపల వేట సాగిస్తూ యానాదుల జీవనోపాధికి ఆటంకం కలిగిస్తోందని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసి పెంచలయ్య డిమాండ్ చేశారు. కండలేరు జలాశయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వేలాది మంది యానాదుల పొట్ట కొట్టేలా వ్యవహరిస్తున్న ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.