ELR: వినాయక నిమజ్జనం సమయంలో భద్రత చాలా ముఖ్యం అని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ఆదివారం ఏలూరులోని నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన ఆయన పలు సూచనలు ఇచ్చారు. ఈత రాని వారు నీటిలోకి దిగకూడదు. చిన్నపిల్లలు పెద్దల పర్యవేక్షణలోనే ఉండాలి. డీజేలు, అశ్లీల నృత్యాలు వద్దు – భక్తి సంగీతం మాత్రమే ఉండాలన్నారు.