కోనసీమ: సీఎం చంద్రబాబు ఈ నెల 9న మండపేట నియోజకవర్గంలో పర్యటించనున్న సందర్భంగా సభా ఏర్పాట్లకు సంబంధించి స్ధలాన్ని రాయవరంలో రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పరిశీలించారు. రాజమహేంద్రవరం ఆర్డీవో ఆర్.కృష్ణ నాయక్, డీఎస్పీ రఘువీర్, ఎంపీడీవో స్పందన, తహసీల్దార్ బీఎస్వీ భాస్కర్, కూటమి నాయకులతో కలసి పరిశీలించారు.