SS: కరుడుగట్టిన నేరస్థుడు పసుపులేటి సాయికుమార్‌పై పీడీ యాక్ట్ అమలు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు కదిరి డీఎస్పీ శివన్నారాయణ స్వామి తెలిపారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఇతనిపై 43 దొంగతనం కేసులు ఉన్నాయి. కలెక్టర్, ఎస్పీ ఆదేశాలతో ఈ చర్యలు తీసుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిపైనైనా పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు.