SS: జిల్లాలో ఆదివారం కిలో స్కిన్ చికెన్ ధర రూ.260గా, స్కిన్లెస్ చికెన్ రూ.295 వరకు విక్రయిస్తున్నారు. గత వారంతో పోలిస్తే ధరలు రూ.10 నుంచి రూ.20 వరకు పెరిగాయి. ప్రాంతాలవారీగా ధరల్లో తేడా ఉండొచ్చని వ్యాపారులు తెలిపారు. ఇప్పుడే ఈ స్థాయిలో ధరలు ఉంటే, సంక్రాంతికి మరింత పెరుగుతాయేమోనని సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.