EG: తాళ్లపూడి మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు గంట శివరామకృష్ణను పార్టీ కార్యక్రమాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఉమ్మడి ప.గో. జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు ప్రకటించారు. శివరామకృష్ణపై వివిధ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదైనట్లు పార్టీ దృష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజనిర్ధారణ కమిటీ విచారణ పూర్తయ్యే వరకు పార్టీకి దూరంగా ఉండాలన్నారు