KRNL: కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియం ఆవరణంలో జిల్లా మహిళా శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వన్ స్టాప్ సెంటర్ సఖి కేంద్రం వాహనాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి జెండా ఊపి ప్రారంభించారు. మహిళలు, బాలికలకు అత్యవసర సహాయం, కౌన్సెలింగ్, చట్టపరమైన సేవలు అందించడంలో ఈ వాహనం కీలకంగా నిలుస్తుందని తెలిపారు.