W.G: ఫీవర్ సర్వేకు ప్రజలంతా సహకరించాలని మున్సిపల్ కమిషనర్ ఎం. ఏసు బాబు కోరారు. శుక్రవారం తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలంతా కాచి చల్లార్చిన నీటిని తాగాలని, వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలన్నారు. మంచినీటి నాణ్యతను పరిశీలించడం జరుగుతుందన్నారు. చెత్త నుంచి కంపోస్ట్ తయారు చేసి, ప్రజలకు ఆర్గానిక్ ఆహారం అందిస్తామన్నారు.