PPM: ఈనెల 16న పాలకొండలో జరిగే ౩వ రైతు సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చెయ్యాలని జిల్లా కార్యదర్శి ఆర్.లక్షుంనాయుడు కోరారు. ఈమేరకు ఆదివారం సీతానగరం మండలం లచ్చయ్యపీట, రామవరం, అంటిపేట, జగ్గునాయుడుపేట గ్రామాల్లో ఆదివారం పోస్టల్ కరపత్రంతో మహాసభలపై రైతుసంఘం నాయకులు ప్రచారం చేశారు. రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.