విశాఖ: విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆదివారం ఆలస్యంగా బయలుదేరనుంది. వాస్తవానికి ఉదయం 5:45 గంటలకు బయలుదేరవలసిన ఈ రైలు, సుమారు ఆరు గంటలు ఆలస్యంగా ఉదయం 11:30 గంటలకు బయలుదేరనుందని విశాఖ రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.