KKD: తాళ్లరేవు మండలం కోరింగ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాన్ని (పీఏసీఎస్) ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సోమవారం సందర్శించారు. పీఏసీఎస్‌లో సభ్యత్వం కలిగిన అరబరుకుల లక్ష్మి ప్రమాదవశాత్తు ఇటీవల మరణించింది. ఆమె కుటుంబ సభ్యులకు సభ్యత్వం ద్వారా మంజూరైన రూ. 2 లక్షల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.