NLG: చందంపేట మండలం గన్కానాయక్ తండాలో సోమవారం సాయంత్రం విద్యుత్ ఘాతంతో మూడు మేకలు మృతి చెందాయి. బాధితులు రామావత్ తెలిపిన వివరాల ప్రకారం.. మేకలు గ్రామ శివారులో పొలంలో మేత మేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. వీటి విలువ లక్ష రూపాయలు ఉంటుందని, ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.