KMM: రైతులకు ఉపయోగపడే విధంగా సీసీఐ నిబంధనలు మార్చాలని మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ లింగాల కమల్ రాజు అన్నారు. మంగళవారం మధిర మండలం కాంచీపురం వద్ద ఉన్న సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ నేతలు సందర్శించారు. పత్తిలో 18% తేమ ఉన్న కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పత్తి కొనుగోలు కేంద్రాలను మార్కెట్ యార్డులోనే కొనసాగించాలని పేర్కొన్నారు.