NRPT: అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై రాముడు తెలిపారు. పిల్లిగుండు తండా నుంచి లింగంపల్లికి ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను, బొమ్మన్పాడు నుంచి కోటకొండకు ఇసుకను తరలిస్తున్న ఒక ట్రాక్టర్ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మూడు ట్రాక్టర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI వివరించారు.