BHPL: 42% బీసి రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్లో కలపాలని కోరుతూ.. గణపురం మండల కేంద్రానికి చెందిన బీసీ జేఏసీ నేతలు తహసీల్దార్ సత్యనారాయణకు సోమవారం వినతి పత్రం అందజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు మోసం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీసీలకు వెంటనే న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.