MBNR: ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే తమ ప్రజా ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన కొమ్మిరెడ్డిపల్లిలో హైమాస్ట్ లైట్లను నిన్న ప్రారంభించి మాట్లాడారు. ప్రజల అవసరాలకు అనుగుణంగానే తమ ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.