NLG: కేతేపల్లి మండలం కాసనగోడు అంగన్వాడీ పరిధిలో జరిగిన విషాద ఘటనపై కలెక్టర్ ఇలా త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. నాలుగేళ్ల బాలుడు కుంచె ఆయాన్ నీటి గుంటలో పడి మృతి చెందడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఘటన కేంద్రం వెలుపల జరిగినప్పటికీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.