PLD: పల్నాటి వీరారాధన ఉత్సవాలు ఈనెల 19 నుంచి 23 వరకు కారంపూడిలోని వీర్లగుడి ప్రాంగణంలో జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఇవాళ సమావేశం జరుగనుందని తహసీల్దార్ వెంకటేశ్వర్లు నాయక్ తెలిపారు. గురజాల ఆర్డీవో అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొననున్నట్లు ఆయన పేర్కొన్నారు.