ASR: అరకు మండలం ఎం.హట్టగూడ గ్రామంలో మంగళవారం అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం పర్యటించారు. అక్కడ నిర్వహించిన వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీ అధినేత జగన్ పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం కార్పొరేట్ తరహాలో అందించాలనే మంచి ఉద్దేశ్యంతో 17 కళాశాలలు తీసుకొచ్చారని, కానీ చంద్రబాబు ప్రభుత్వం కళాశాలలు ప్రైవేటుపరం చేయడం దారుణమన్నారు.