BDK: భద్రాచలం నియోజికవర్గ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వరక అజిత్ మాట్లాడుతూ.. గత నాలుగేళ్లగా పెండింగ్లో ఉన్న రూ. 8500 రూపాయల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల అయ్యే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు.