TG: గచ్చిబౌలిలో మరోసారి డ్రగ్స్ పార్టీని SOT పోలీసులు భగ్నం చేశారు. కోలివింగ్ గెస్ట్ రూంలో డ్రగ్స్ వినియోగం జరుగుతుందన్న సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో 12 మందిని అరెస్ట్ చేశారు. కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి యువకులకు అమ్మిన గుత్తా సాయితేజతో పాటు ఓ నైజీరియన్ వాసిని పోలీసులు పట్టుకున్నారు.