ADB: ఇటీవల అనారోగ్యంతో మరణించిన భేలా మండలం సదల్పూర్ గ్రామానికి చెందిన ఆదివాసి మహిళ టేకం పోతూబాయి కుటుంబానికి అండగా ఉంటామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సోమవారం రాత్రి ఆదిలాబాద్‌లో పోతూబాయి కుటుంబ సభ్యులు కలెక్టర్‌ను కలిశారు. ఆయన మాట్లాడుతూ.. కుటుంబంలో ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామన్నారు. ప్రభుత్వం ద్వారా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు.