కృష్ణా: జమిలీ ఎన్నికలకు సీపీఐ పార్టీ వ్యతిరేకమని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి రాజా అన్నారు. మంగళవారం విజయవాడలో సీపీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఏపీ ప్రభుత్వానికి, అదానీకి మధ్య అవినీతి జరిగిందని ఈ ఘటనలో అదానీని కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేయడానికి ఎందుకు వెనుకడుగు వేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. అదానీ ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలన్నరు.