TG: ఆటో డ్రైవర్ల వేషధారణలో BRS నిరసనలు చేపట్టింది. ఈ క్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఆటోల్లో బయలుదేరారు. నిన్న నల్లచొక్కాలతో సభకు వచ్చిన నేతలు.. ఇవాళ ఆటో డ్రైవర్ల వేషధారణలో రానున్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఆటోవాలాల ఆత్మహత్యలు, వారికి ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు.