ASR: కొయ్యూరు మండలంలోని ఆడాకుల గ్రామంలో ఈనెల 19వ తేదీన నిర్వహించే గ్రామ సభను రద్దు చేయాలని ఆదివాసీ జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావు దొర డిమాండ్ చేశారు. ఈమేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఆడాకుల గ్రామంలో ఏర్పాటు చేయనున్న గ్రామ సభ పీసా చట్టాన్ని ఉల్లంఘించే విధంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో గ్రామ సభ రద్దు చేయాలని కోరారు.