ASR: గూడెం కొత్తవీధి మండలంలోని ఆర్వీ నగర్ గ్రామంలో సుమారు ఏడేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనకు కారణమైన ఒడిశాకు చెందిన లారీ డ్రైవర్ తరుణ్ హల్దార్కు పదేళ్ల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పినట్లు సీఐ పీ.వర ప్రసాద్ బుధవారం తెలిపారు. 2017 లో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల లారీ ఓ దుకాణంపైకి దూసుకొని వెళ్లింది.