భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానించినందుకు కేంద్రమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం అంబేద్కర్ పేరును వినియోగించుకోవడం పరిపాటిగా మారిందని పేర్కొన్నారు. అంబేద్కర్, అంబేద్కర్ అని పిలిచే బదులు దేవుడి పేరు తలుచుకుంటేనైనా పుణ్యం వస్తుందని.. స్వర్గానికి వెళ్లొచ్చని అన్నారు. మనుస్మృతిని విశ్వసించే వారు కచ్చితంగా అంబేద్కర్ను విభేదిస్తారని మండిపడ్డారు.