Balineni భావొద్వేగం.. మీడియాముఖంగా కంటతడి, గోనె చేత మాట్లాడించారంటూ..
గోనె ప్రకాశ్ రావు చేసిన ఆరోపణలపై బాలినేని శ్రీనివాస రెడ్డి స్పందించారు. ఆయన చేత కావాలనే మాట్లాడిస్తున్నారని పేర్కొన్నారు. భావోద్వేగానికి గురై.. కంటతడి పెట్టారు.
Balineni Srinivasa Reddy:మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై (Balineni Srinivasa Reddy) సీనియర్ నేత గోనె ప్రకాశ్ రావు హాట్ కామెంట్స్ చేశారు. గోనె కామెంట్లపై బాలినేని భావొద్వేగానికి గురయ్యారు. కంట తడి పెట్టారు. తనపై కావాలనే మాట్లాడిస్తున్నట్టు అనిపిస్తోందని చెప్పారు. పార్టీ కోసం చాలా కష్టపడ్డానని వివరించారు. తప్పు చేసినట్టు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ఆర్ అని తెలిపారు. తన గురించి గోనె ప్రకాశ్ మాట్లాడాల్సిన అవసరం ఏముందని అడిగారు. తనపై ఎమ్మెల్యేల చేత సీఎం జగన్‌కు ఫిర్యాదు చేయిస్తున్నానని తెలిపారు.
రీజనల్ కో ఆర్డినేటర్ పదవీకి రాజీనామా చేయడానికి గల కారణం మోరాసారి వివరించారు. 3 జిల్లాలు తిరిగి.. ఒంగోలు నియోజకవర్గానికి సమయం కేటాయించడం వీలు కావడం లేదన్నారు. అందుకే కోసమే రిజైన్ చేశానని తెలిపారు. తను టికెట్ ఇప్పించిన వారే తనపై కంప్లైంట్ చేస్తున్నారని తెలిపారు.
మాజీమంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై (balinani srinivasa reddy) సీనియర్ నేత గోనె ప్రకాశ్ రావు (Gone Prakash Rao) మండిపడ్డారు. బాలినేని శ్రీనివాస రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది వైవీ సుబ్బారెడ్డి అని గుర్తుచేశారు. సుబ్బారెడ్డి చెల్లిని బాలినేని (balinani) పెళ్లి చేసుకున్నారని.. బావకు రాజకీయంగా అవకాశం కల్పించారని తెలిపారు. ఇప్పుడు సుబ్బారెడ్డిని విమర్శించడం మంచి పద్దతి కాదన్నారు. గ్యాంబ్లింగ్‌లో వందల కోట్లు బాలినేనికి ఎలా వచ్చాయని అడిగారు. అందరికీ డబ్బులు పోతే.. శ్రీలంకలో ఇతనికి వచ్చాయని చెప్పారు. బాలినేని టీడీపీలోకి వెళ్లాలని అనుకుంటున్నారని తెలిసింది.. వెళితే వెళ్లని, కానీ వైవీ సుబ్బారెడ్డిపై ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు.