ఏలూరు జిల్లాలో మట్టి అక్రమ తవ్వకాలు, రవాణాపై కలెక్టర్ వెట్రిసెల్వి తీవ్రంగా స్పందించారు. అనుమతి లేకుండా కాలువలు, చెరువుల గట్ల నుంచి మట్టిని తవ్వడం చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. ఇటువంటి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన కేసులు నమోదు చేసి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని అధికారులకు ఆదేశించారు.