ప్రకాశం: కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తీసుకెళ్లాలని కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. ఆదివారం పట్నంలోని ఒకటో వార్డులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కుటమీ ప్రభుత్వం అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు.